-ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ..పండ్ల పంపిణీ

క్యాతనపల్లి ప్రత్యక్షత:-మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ సూపర్ బజార్ ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ 32వ జెండా ఆవిష్కరణతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు పరీక్షా ప్యాడ్లు, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కళ్యాణ్, ఆర్ముల పోశం, కాదాసి సంపత్, కన్నూరి రాజేందర్, ఆవునూరి గట్టయ్య, రామిల్ల మల్లేష్, దాసరపు ఆగయ్య, మారపల్లి రాజయ్య, ఎల్లసాని శ్రీనివాస్, సలిగముల రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు మారపల్లి సాయికుమార్, రేణిగుంట్ల అఖిల్, కవంపల్లి ప్రవీణ్, కలువల శ్రీనివాస్, కిరణ్, డప్పు కళాకారులు చిర్రా వెంకటి, తుంగ వెంకటేష్, గుడిసెల రమేష్, రెల్లి సంఘం నాయకులు నాగరాజు, ప్రసాద్, ఎంఎస్పీ నాయకులు దుప్పటి రాజు, రేణిగుంట్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

