
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్ పట్టణంలోని పలు జ్యువెలరీ దుకాణాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, రికార్డింగ్ సామర్థ్యం, కెమెరాల కవరేజీని తనిఖీ చేసి, ప్రతి జ్యువెలరీ దుకాణంలో నాణ్యమైన సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి అవి 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని యజమానులకు సూచించారు. అలాగే డీవీఆర్ రికార్డింగ్‌ను భద్రంగా భద్రపరచాలని, భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, నేరాల నివారణలో వ్యాపారుల అప్రమత్తత కూడా కీలకమని ఎస్ఐ పేర్కొన్నారు.

