హోమ్టాప్ న్యూస్ప్రపంచ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం

ప్రపంచ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం

Published on

spot_img

-బట్ట సంచుల పంపిణీతో అవగాహన

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలోని బీ జోన్ సెంటర్లో ప్రపంచ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ సేవా సంఘం ఆధ్వర్యంలో బట్ట సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నులిగొండ సత్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా మానుకుని బట్ట సంచులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, జీవరాశులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రాంత బాధ్యులు మంద వేణు, మాజీ అధ్యక్షుడు వనం సత్యనారాయణ, ద్వితీయ ఉపాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు వేముల వెంకటేశం, రాజేష్ కన్నా, సభ్యుడు గోక శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రజలకు బట్ట సంచులను పంపిణీ చేశారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this