
మంచిర్యాల ప్రత్యక్షత:-ఇరిగేషన్ శాఖలో సుదీర్ఘకాలంగా ప్రజాసేవ అందిస్తూ విశిష్ట సేవలను అందించిన చీఫ్ ఇంజనీర్ సత్యరాజ్ చంద్ర పదవీ విరమణ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 38 సంవత్సరాలపాటు ఇరిగేషన్ శాఖలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి శాఖ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను ఈ సందర్భంగా టీఎన్జీవో నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యరాజ్ చంద్ర ఉద్యోగ జీవితమంతా క్రమశిక్షణ, నిబద్ధత, సేవా దృక్పథంతో పనిచేసి సహచర ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజానికి సేవ చేసే అవకాశాలు ఇంకా కొనసాగుతాయని పేర్కొన్నారు. సత్యరాజ్ చంద్రను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఆయన భవిష్యత్తు జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ టీఎన్జీవో నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి రాంకుమార్, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, సెక్రటరీ అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసుఫ్ తదితరులు పాల్గొని సత్యరాజ్ చంద్రకు అభినందనలు తెలియజేశారు.

