హోమ్టాప్ న్యూస్ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

Published on

spot_img

-పోలియో వ్యాధి నిర్మూలన సాధ్యమని వైద్యుల వెల్లడి

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. చిన్నారులను పోలియో వ్యాధి బారిన పడకుండా రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మందమర్రి ప్రాంతంలోని దీపక్ నగర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఒకటో వార్డు తారకరామ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, సూపర్వైజర్ సురేఖ, ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్ సునీత పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.అధికారులు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధి పూర్తిగా నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో ప్రత్యేక బృందాల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this