హోమ్టాప్ న్యూస్భద్రతాధికారికి ఘన స్వాగతం పలికిన ఐఎన్‌టీయూసీ నాయకులు

భద్రతాధికారికి ఘన స్వాగతం పలికిన ఐఎన్‌టీయూసీ నాయకులు

Published on

spot_img

మందమర్రి ప్రత్యక్షత:-శ్రీరాంపూర్ ప్రాంతంలో నాణ్యత విభాగంలో అధికారిగా సేవలందించి, తాజాగా ప్రాంతీయ భద్రతాధికారిగా మందమర్రికి బదిలీపై వచ్చిన వెంకటేశ్వర రెడ్డి కి ఐఎన్‌టీయూసీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.ఆదివారం మందమర్రిలోని భద్రత మరియు పరిరక్షణ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వెంకటేశ్వర రెడ్డి గతంలో తన విధులను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు పొందారని తెలిపారు. అదే విధంగా మందమర్రిలో కూడా ఉద్యోగులు, కార్మికులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ మందమర్రి ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ నాయకులు జగన్నాథ చారి, జంగా శ్రీనివాస్, విభాగ కార్యదర్శి కె.ఆర్. సంపత్, సహాయ విభాగ కార్యదర్శి సి.హెచ్. మురళి, కార్యాలయ పర్యవేక్షకుడు మద్దెల శంకర్, జూనియర్ పరిశీలకుడు సంజయ్ కుమార్ దాస్, జమేదార్ చంద్ర గౌడ్‌తో పాటు భద్రతా సిబ్బంది, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this