-ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గ ప్రసాద్
-ఏఐఏవైఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
-విశిష్ట మహిళ రమాబాయి, అంబేద్కర్ పురస్కారాల అందజేత
-పురస్కారం అందుకున్న జాడ శ్రీలత

రామకృష్ణాపూర్ ప్రత్యేక్షత:-మహిళలు తమకు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని, పురుషులతో సమానంగా రాణించాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గ ప్రసాద్ తెలిపారు. సోమవారం మండలంలోని గద్దెరాగడి లో గల శాంకరీ గార్డెన్స్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బండ శాంకరి అధ్యక్షతన నిర్వహించిన విశిష్ట మహిళ రమాబాయి అంబేద్కర్ – 2026 పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేధికపై సింగరేణి మహిళ కార్మికురాలు జాడ శ్రీలత విశిష్ట మహిళ రమా బాయి అంబేద్కర్-2026 పురస్కారం నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈసందర్భంగా దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ, సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పదని మహిళలు ఉన్నతంగా ఉంటేనే కుటుంబం తద్వారా సమాజ బాగుపడుతుందని తెలిపారు. వయోజన విద్యాశాఖ డిడి అజ్మీర పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, మహిళలు చదువుకున్నప్పుడే సామాజిక బాధ్యత పెరుగుతుందని, నిరక్షరాస్యులుగా మహిళలు ఉండకూడదని చదువుకోవడం వల్లే అభివృద్ధిలోకి వస్తారని తెలిపారు. ముందుగా అతిథులు మహిళలకు ఆటల పోటీలు, పాటల పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభించి, ముందుగా రమాబాయి, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలకు విశిష్ట మహిళ రమాబాయి, అంబేద్కర్ పురస్కారం – 2026 పురస్కారాలను అతిథులు అందజేశారు. ఈఅవార్డుని అందుకున్న వారిలో మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ప్రజా ప్రతినిధి, నీరటి రాజేశ్వరి జిల్లా ఉన్నతాధికారి, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, డాక్టర్ మాడ శ్రీదివ్య మెడికల్ ఆఫీసర్, గడ్డి శారద ఉపాధ్యాయురాలు, భాష శిరీష క్రైమ్ బ్రాంచ్ ఎస్సై, చంద్రపాటి శిల్ప శర్మ లాయర్, శేర్ల స్వర్ణలత ఇంజనీర్, తిరునగరి సాహితి బిజినెస్ ఉమెన్, కోట్నాక మమత స్పోర్ట్స్ ఉమెన్, గాజుల నర్మదా గౌడ్ ప్రముఖ నృత్య కళాకారిణి, ఎస్ నీలాదేవి ప్రముఖ రచయిత్రి, పోతుగంటి సౌజన్య పోలీస్ కానిస్టేబుల్, బంగారు వనిత అంగన్వాడీ టీచర్, బొడ్డు సరోజన అంగన్వాడి ఆయా, పూసాల సత్యవతి ఆర్పి మెప్మా, బెల్లాల భారతి ఏఎన్ఎం, ఈరబోయిన స్వరూప ఆశా కార్యకర్త, తొగరి అరుణ వంట కార్మికురాలు, మల్యాల రజిత పారిశుద్ధ్య కార్మికురాలు, ఎంబడి పద్మ వ్యవసాయ ఆదర్శ రైతు, కున్సోత్ వి జానకి ప్రసన్న బ్యాంకింగ్ రంగం, జాడ శ్రీలత సింగరేణి మహిళా కార్మికురాలు కలరు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ సమన్వయకర్తగా వ్యవహరించగా, అతిధులుగా నస్పూర్ మండల విద్యాధికారి ఇడుగురాల పద్మజ, లయన్స్ క్లబ్ సఖి మంచిర్యాల అధ్యక్షురాలు ఎన్ రూప, సఖి ప్రెసిడెంట్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కవిత అజయ్, కవిత వనిత వాక్కు కో ఫౌండర్, శాంకరి గార్డెన్స్ అధినేత పత్తి శ్రీనివాస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నెరువట్ల రాజలింగు, ప్రముఖ గాయకులు భూపతి నారాయణరావు, గౌరవ అధ్యక్షురాలు సుంకరి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉప్పులేటి గోపిక, జిల్లా కార్యదర్శి సమిండ్ల లక్ష్మీ, కరాటే మాస్టర్ రమేష్ రాజా, సమీక్ష అకాడమీ కొరియోగ్రాఫర్ మెస్సీ లు పాల్గొన్నారు.
