-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కమర్షియల్ టాక్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఐలాపురం అనురాగ్ సోమవారం ఇందారం వద్ద విధినిర్వహణలో భాగంగా చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తుండగా గుర్తుతెలియని కారు దూసుకెళ్లడంతో, ఈ ప్రమాదంలో అనురాగ్ మృతి చెందడం బాధాకరమని, అనురాగ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి డిమాండ్ చేశారు. జిల్లాలోని నస్పూర్ లో గల టిఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని అనురాగ్ నివాసంలో మంగళవారం టిఎన్జీవో ఆధ్వర్యంలో అనురాగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, అనురాగ్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఇలాంటి సంఘటనలు చాలా విచారకరమని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పై జరిగిన సంఘటనలు మరవక ముందే, ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైన తెలిపారు. ఎక్సైజ్ విభాగంలో ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుల్ కు ఎక్స్ గ్రేషియా ఇచ్చిన విధంగా, అనురాగ్ కుటుంబాన్ని సైతం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ లను సైతం ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, కేజియా రాణి, నరేందర్, అంజయ్య, శ్రీధర్ రాజు, శివప్రసాద్ సంయుక్త కార్యదర్శులు సునీత ప్రభు, పద్మలత, సురేందర్, రవికిరణ్, రోశయ్య, కార్తీక్,ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, పబ్లిసిటీ కార్యదర్శి యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ ప్రశాంత్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, లక్షేట్టిపేట్ యూనిట్ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, చెన్నూరు యూనిట్ అధ్యక్షుడు అభిషేక్, జిల్లా కార్యవర్గ సభ్యులు సదానందం, కుమార్, పద్మజ, ప్రణవానంద్, సరిత, వెంకటస్వామి, వెంకటేష్ లు పాల్గొన్నారు.