
మంచిర్యాల ప్రత్యక్షత:-టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కి పదోన్నతి పొందిన పి చంద్రయ్య, అలాగే మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస రావు అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారి కార్యాలయాల్లో టీఎన్జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం తో పాటు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని ఉద్యోగులందరూ జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ నేతృత్వంలో జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగులు అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ అందజేసే విధంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి,భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్,తిరుపతి, కేజియా రాణి, నరేందర్, అంజయ్య, శ్రీదర్,రాజు, శివ ప్రసాద్,సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, పద్మలత, సురేందర్, రవి కిరణ్, రోశయ్య, కార్తీక్,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్,పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, లక్షెట్టిపేట యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస్, చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, పద్మజ, ప్రణవానంద్ సరిత,వెంకటస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
