-ప్రత్యేక సందర్భాలలో సేవా కార్యక్రమాలు:సోను దంపతులు
-18వార్డ్ కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు ఆ దంపతులకు సన్మానం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలో సమాజం పట్ల తమ ప్రేమ, బాధ్యతను మరోసారి కార్యరూపంలో చూపిస్తూ గోదావరిఖని నివాసి సోను దంపతులు, మిత్ర బృందం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పుత్రుడు నిర్వేద్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామకృష్ణాపూర్ ప్రాంతంలో 9 పేద కుటుంబాలకు సుమారు రూ,25వేల విలువైన నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.గత ఎనిమిది నెలలుగా ప్రతి నెలా 5 పేద కుటుంబాలను ఎంపిక చేసి ఇదే విధంగా నిత్యావసర సరుకులు అందజేస్తూ వస్తున్నారు. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను ఆర్భాటంగా కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు, మూగజీవాల సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాబురావు, డి.సమ్మయ్య మాట్లాడుతూ, సోను దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని కొనియాడారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వడం ద్వారా వారు నిజమైన మానవత్వాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. సమాజంలో మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాలకు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు.సోను దంపతుల చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు సహాయ అందించిన తన సోదరుని స్నేహితులు కేశవరపు సత్యవెంకట్, నిమ్మల సంతోష్ రెడ్డి,హర్షరెడ్డి యాలంగరి,మేడిపల్లి రోహిత్ రెడ్డి, మీసాల కళ్యాణ్ కుమార్, కి మీసాల సతీష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు,ప్రతినెల నిరుపేదలకు ఈ విధంగా సహాయం అందిస్తున్న మీసాల సతీష్ కుమార్( సోను బాయ్ ) కి క్యాతనపల్లి మున్సిపాలిటీ 18వ వార్డ్ కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు దంపతులకు శాలువాతో సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పసరగొండ కృష్ణకాంత్( కిట్టు), ఎం.డి ఇబ్రహీం, అంతడుపుల నాగరాజు,పల్లె దీక్షిత్, పానుగంటి సాయి తదితరులు పాల్గొన్నారు.
