-ముఖ్యమంత్రికి జిల్లా టిఎన్జీవో తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు

-ప్రభుత్వ పథకం అమలులో కీలక పాత్ర పోషించిన టీఎన్జీవో కేంద్ర సంఘం

-మంచిర్యాల టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల కోసం సర్కార్ రెండు కొత్త పథకాలు ప్రకటించింది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ప్రమాద బీమా పథకం వర్తింపజేసేందుకు సిద్ధమైంది మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచిర్యాల టిఎన్జీవో తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద కోటి రూపాయల బీమా సదుపాయం కల్పించడం వైద్య విధానం పరిషత్ ఉద్యోగుల జీతాల ద్వారా చెల్లిస్తూ ప్రత్యేక డైరెక్టరేట్ ను మంజూరు చేయడం అనుకూల విధానాలు ప్రవేశపెట్టినందుకు ముఖ్య పాత్ర పోషించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ లకు జిల్లా టీఎన్జీవో తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఉద్యోగుల ఆరోగ్య పథకాల గురించి తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంగా అనారోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు,రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందుతాయని అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న పిఆర్,సి డి ఏ లను మరిన్ని బిల్లులు, బకాయిలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, రాంకుమార్, తిరుపతి నరేందర్ సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ స్పోర్ట్స్ సెక్రటరీ అనురాగ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్,చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్, లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస్, కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్,కుమార్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి