-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-మున్సిపల్ ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ప్రకటన ద్వారా కోరారు. ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు చేసిందని అన్నారు.ఎన్నికల నియమావళి అమలులో బాగంగా జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కువినియోగించు కోవాలన్నారు.ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు వేయాలని, దేశ పౌరులుగా ఏన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఎన్నికల కోసం ఓటు వేసే ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, కర్మాగారాలకు పోలింగ్ రోజున ఆయా సంస్థలలో పని చేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి వీలుగా వేతనంతో కూడిన సెలవు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సెలవు ప్రకటించారు.