-టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యేక్షత:-వెలుగు తెలుగు దినపత్రికలో ఆదివార టిఎన్జీవో సంఘం పై, సంఘం నేతలపై వచ్చిన వార్తా కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. 80 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన టిఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ఉద్యోగుల హక్కుల సాధనలోనే కాకుండా 610 జీఓ ను సాధించి, అంతిమంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి, తెలంగాణ సాధించిన సంఘంగా చరిత్ర లి గుర్తింపు ఉన్న సంఘమని, ఇటువంటి సంఘంపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్రంలో 80 సంవత్సరాల చరిత్రకు మసక తెచ్చిన ఈ వార్తల్లో నిజాలు లేవని, టీఎన్జీవో సంఘంలో గెజిటెడ్ అధికారులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. గతంలో ఎన్జీవో క్యాడర్ లో ఉండి, గెజిటెడ్ స్టేటస్ ఇచ్చినప్పటికీ సర్వీస్ నిబంధనల మార్పు చేయకుండా, గెజిటెడ్ పే స్కేల్ ఇవ్వకుండా, కేవలం పేరుకే గెజిటెడ్ స్టేషన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, ఆ కేడర్ లను టిఎన్జీవో సంఘంలో కొనసాగించడానికి ప్రభుత్వం, టిఎన్జీవో సంఘం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. గెజిట్ ఇవ్వకుండా గెజిటెడ్ అధికారి స్థాయికి పెంచడం వల్ల ఉపయోగం లేదు కనుక ఆ పోస్టులకు గెజిటెడ్ స్థాయి కల్పించినప్పటికీ సంఘం లోనే కొనసాగేలా 2010లో తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపించామని, వారు సంఘంలోనే కొనసాగుతున్నారని వివరించారు. ఒకవేళ అలాంటి అవకాశం లేకుంటే సంఘం పేరును తెలంగాణ నేటీవ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ సంఘంగా మార్చడానికి స్టాండింగ్ కౌన్సిల్ లో తీర్మానం చేసి, ప్రభుత్వ అనుమతి కొరకు పంపించడం జరిగిందన్నారు. ఇందులో మిగతా సంఘాలకు అభ్యంతరం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. దేశ రాజ్యాంగాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అనేకసార్లు సవరణ చేశారని, తమ సంఘంలో సమయం, సందర్భంగా మార్పులతో సవరణ ప్రతిపాదించామని తెలిపారు. వీటి మీద దుర్మార్గంగా వార్తలు రాయిస్తున్న వారెవరో తమకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామిక పద్దతిలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల స్థాయి పోస్టల రద్దు చేసి, గెజిటెడ్ అధికారుల సంఖ్యను పెంచడం, కొత్త జిల్లాలు, జోనల్ పోస్టుల్లో గందరగోళం, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల బేసిక్ పే స్కేల్ పెంచకపోవడం, పదోన్నతుల కోసం అదనపు గెజిటెడ్ పోస్టులు మంజూరు చేయకపోవడం, గెజిటెడ్ ఉద్యోగులకు ఏన్యువల్ సర్వీస్, వెరిఫికేషన్ పేరిట, డిపిసి ల పేరిట గెజిట్ ఉద్యోగుల సమ్మెలు చేసే హక్కు లేకపోవడం లాంటి అనేక కారణాలతో ఎన్జీవో సంఘంలో చర్చించిన తర్వాతనే గెజిటెడ్ స్టేటస్ లో చేరిన ఉద్యోగులను టిఎన్జీవో సంఘంలో కొనసాగించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నామన్నారు. టిఎన్జీవో సంఘానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు నిరూపించాల్సిన బాధ్యత వెలుగు దినపత్రిక తీసుకోవాలన్నారు. ప్రభుత్వాల సహకారంతో, పూర్వ నాయకుల పోరాటంతో టీఎన్జీవో భవనాలు ఏర్పడ్డాయని, అవి అంతిమంగా ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయే తప్ప ఏ ఒక్కటి ఉద్యోగ సంఘాల నాయకులు చెందినవని కావని, టీఎన్జీవో సంఘం భవనాలు ప్రజల ఆస్తులుగా మాత్రమే చూస్తామని వివరించారు. సంఘం భవనాలకు కోట్ల రూపాయల అద్దె లు ఎక్కడ రావడం లేవని,భవనాల అనకొర కిరాయిలను కేవలం సంఘం కార్యాకలాపాల కోసమే ఖర్చు చేస్తున్నామని వివరించారు. వేల కోట్ల రూపాయల ఆస్తుల పేరిట టిఎన్జీవో సంఘాన్ని బద్నాం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సంఘంగా ఉన్న సంఘం కీర్తిని తగ్గించే వ్యక్తులు చేస్తున్న ఆరోపాణలను మీడియాలో ముద్రించే ముందు తమ అభిప్రాయాన్ని ఒక్కసారి తీసుకోవాలని ఆలోచన పత్రిక యాజమాన్యానికి లేకపోవడం శోచనీయమన్నారు. తప్పుడు వార్తపై తమ వివరణ ప్రజలకు చేరవేసే బాధ్యత వెలుగు పత్రిక తీసుకోవాలన్నారు. సంఘం ఎప్పుడు ప్రజల్లో భాగమైన ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతుందని, ఎన్ని అసత్య ప్రచారాలకు తలవచ్చదన్నారు‌. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, హక్కులు, బాధ్యతలు రెండు కండ్లగా పోరాడే సంఘం టీఎన్జీవో సంఘమన్నారు. ఇటీవల పుట్టుకువచ్చిన కొంతమంది ఉద్యోగ సంఘాల ముసుగులో టిఎన్జీవో సంఘం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమ కేసులు వేస్తున్న వారికి తగిన గుణపాఠం ఉద్యోగులు చెబుతారన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.ఈకార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, కేజియా రాణి, పద్మ లత,నరేందర్, శ్రీధర్ రాజు, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, పబ్లిసిటీ కార్యదర్శి యూసుఫ్, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్, లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, చెన్నూరు యూనిట్ అధ్యక్షుడు అభిషేక్, కన్నెపల్లి యూనిట్ అధ్యక్షుడు పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్,కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి