-ఆవిష్కరణలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి టీఈజేఏసి టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,పొన్న మల్లయ్య తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సమక్షంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉద్యోగ సంక్షేమం చాటడానికి కృషి చేస్తున్న టీఈజేఏసీ జిల్లా తరఫున తెలంగాణ పద్మశాలి ఉద్యమ సంఘం సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.పొన్న మల్లయ్య తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ..అన్ని శాఖల్లో పని చేస్తున్న పద్మశాలి ఉద్యోగులందరూ పరస్పర సహాయ సహకారాలు అందజేస్తూ సమన్వయంగా సంఘం బలోపేతానికి కృషి చేయాలని పద్మశాలి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడానికి పద్మశాలి ఉద్యోగులు తమ వంతు సహాయం అందించాలని కోరారు. పద్మశాలి మ్యారేజ్ బ్యూరో ప్రతి ఆదివారం ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు వరంగల్, హైదరాబాద్,నల్గొండ,కరీంనగర్, పెద్దపల్లి,నిజామాబాద్ జిల్లాలలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పెళ్లి సంబంధాలు కావలసినవారు సంప్రదించవచ్చని తెలియజేశారు. అనంతరం గ్రూప్ 2 గ్రూప్ 4 ఉద్యోగాలు పొందిన వారిని జిల్లాలో ఖాళీ ఉన్న స్థానాలలో నూతనంగా ఎన్నుకున్న వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గుండేటి అరుణ రాష్ట్ర కార్యనిర్హక కార్యదర్శి,తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తెలంగాణ పద్మశాలి సంఘం గుండేటి యోగేశ్వర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తెలంగాణ వాల్టా ఆక్ట్ మెంబర్ గుండేటి నాందేవ్, జిల్లా వైద్య ఉద్యోగుల ఐక్యవేదిక నడిమెట్ల సత్యనారాయణ,తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భోగ సురేందర్, టీఎన్జీవో ఉపాధ్యక్షులు రాంకుమార్. తిరుపతి బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ మంచిర్యాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి