-35 సంవత్సరాల సేవకు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించేనా..?
-క్యాతనపల్లి 2వ వార్డ్ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేత మారపెల్లి రాజయ్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీలోనే కొనసాగుతూ, కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రలోభాలను, నిర్బంధాలను సైతం అధిగమించి, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ, కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయతను చూపుతున్న కాంగ్రెస్ కార్యకర్తకు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభిస్తుందా అనే చర్చ జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో జోరుగా కొనసాగుతుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారపెల్లి రాజయ్య సతీమణి మారపెల్లి స్వరూప నామినేషన్ దాఖలు చేసింది. గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కరుడుగట్టిన కార్యకర్తగా పని చేస్తూ, పార్టీని నమ్ముకొని ఉన్న రాజయ్య సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి, ఆయన సతీమణి స్వరూప కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందా అనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతగా, స్నేహశీలిగా ప్రజల్లో గుర్తింపు ఉన్న రాజయ్య సేవలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి, టికెట్ కేటాయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తీవ్ర నిర్బంధంలో సైతం పార్టీని వీడకుండా, పార్టీ కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉండి, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు రాజయ్య విశేషంగా కృషి చేశారు. ఈ సందర్భంగా మారపెల్లి రాజయ్య మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి లు తనకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం కలదని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన భార్య స్వరూప నామినేషన్ దాఖలు చేసిందని, తనకు పార్టీ నుండి టికెట్ కేటాయించి, పార్టీపై, పార్టీ అధిష్టానం పై తనకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యదని, పార్టీపై తనకు పూర్తి విశ్వాసం కలదని ధీమాను వ్యక్తం చేశారు.