-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం ను వేడుకలను టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వలననే మనమందరం సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు కృషి చేయాలని తెలిపారు. ఈ గణతంత్ర వేడుకలలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అద్యక్షులు శ్రీపతి బాపు రావు,కోశాధికారి ఏ సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, కేజియా రాణి, పద్మ లత,నరేందర్, శ్రీధర్ రాజు సంయుక్త కార్యదర్శిలు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్ లక్షటిపేట యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్ చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్ కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్,కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత తదితరులు పాల్గొన్నారు.
