-టీఎన్జీవో ఉద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ గనులు,కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో మంగళవారం జిల్లా టిఎన్జీవో క్యాలెండర్,డైరీలను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.జిల్లా టీఎన్జీవో ఉద్యోగుల సమస్యలపై మంత్రితో గడియారం శ్రీహరి చర్చిస్తూ ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డిఏలు, పిఆర్సి బకాయిలను ఉద్యోగులకు అందజేయాలని వినతి పత్రం అందజేశారు.మంచిర్యాల కార్పొరేషన్ ఆయన సందర్భంగా ఉద్యోగులకు 17 శాతం హెచ్ఆర్ఏ ఇప్పించాలని మంత్రిని కోరారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్,తిరుపతి అంజయ్య,కేజియా రాణి, పద్మ లత,నరేందర్, శ్రీధర్ రాజు సంయుక్త కార్యదర్శిలు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ప్రశాంత్ లక్షట్ పేట యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్, కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్, కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి