మంచిర్యాల ప్రత్యక్షత:- సంక్రాంతి సంబరాలను 2026 పురస్కరించుకొని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముందుగా మహిళ సభ్యులతో జనవరి 11 ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా టీఎన్జీవో మహిళ కుటుంబాలతో పాటు పరిసర ప్రాంతంలోని మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతిగా 3వేలు, ద్వితీయ బహుమతికి 2వేలు, తృతీయ బహుమతికి 1 వేయి రూపాయలు బహుమతిగా అందజేసి సన్మానిస్తారని ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పొన్నమల్లయ్య, జిల్లా నాయకులు హబీబ్ హుస్సేన్,భూముల రామ్మోహన్, శ్రీపతి బాబురావు,అరుణ, సునీత, స్వర్ణ, రమాదేవి, పుష్పలత కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

పోటీలో పాల్గొనేవారు సంప్రదించవలసిన నెంబర్:-

ఎ.సునీత 70133 52118, పి.స్వర్ణలత 81795 67012,
డి.కమల 94930 01468, వి.పద్మాంజలి 90105 00073 పోటీలో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి