-వేడుకలను ఘనంగా నిర్వహించిన:గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హౌసింగ్ సొసైటీ మహిళ సభ్యులందరూ తీరొక్క రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి హౌసింగ్ సొసైటీ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలులో ఆటపాటలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో ఆడి పాడారు.అనంతరం గోదావరి నదిలో బతుకమ్మలను నిమర్జనం చేసి. పసుపుతో చేసిన గౌరమ్మ గౌరీ దేవిని పూజించిన ఆడపడుచులు పసుపు,కుంకుమ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను, పూల సౌందర్యాన్ని, స్త్రీశక్తి స్ఫూర్తిని కలగలిపిన పండుగే బతుకమ్మ పండుగ. ఈ పండుగలో భాగంగా మహిళలందరూ ఒక్కచోట చేరి పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఆరాధిస్తారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ సమాజంలోని ఐక్యత, స్త్రీల గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకని అన్నారు. తెలంగాణ టీఎన్జీవో మహిళ సభ్యులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యనిర్వాహ సభ్యులు.కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, నాగుల గోపాల్, జిల్లా టీఎన్జీవో సభ్యులు, టీఎన్జీవో,ఉత్సవ కమిటీ మహిళల సభ్యులందరూ వేడుకల్లో పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి