హోమ్ టాప్ న్యూస్ షిరిడిలో 18వ ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమావేశం

షిరిడిలో 18వ ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమావేశం

0

-జాతీయ సమావేశంలో తెలంగాణ ఉద్యోగ నాయకులు

మంచిర్యాల ప్రత్యక్షత:-అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశం మహారాష్ట్రలోని షిరిడి లో జాతీయ అధ్యక్షులు సుబాస్ లంబా,శ్రీకుమార్ ల అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేన్,జాతీయ కార్యవర్గ సభ్యులు ముత్యాల సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య లు పాల్గొన్నారు.ఈ జాతీయ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ తొలగించి పాత పెన్షన్ ఓపిఎస్ అమలు చేయాలని అన్నారు. ఉద్యోగుల ఐటి పరిధి 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పెంచాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version