హోమ్ టాప్ న్యూస్ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన:మారుతి ప్రసాద్

నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన:మారుతి ప్రసాద్

0

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా మారుతి ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఇటీవల కాలంలో సాధారణ మున్సిపాలిటీ కమిషనర్లను బదిలీ ఉత్తర్వులను విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించిన మారుతి ప్రసాద్ క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీపై వచ్చారు. అంతకుముందు విధులు నిర్వర్తించిన కమిషనర్ రాజు ఆదిలాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ మాట్లాడుతూ..క్యాతనపల్లి పురవాసులకు అందుబాటులో ఉంటానని, ప్రజలకు సమస్యలుంటే తనను సంప్రదించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. నూతన కమిషనర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను కార్యాలయ సిబ్బంది, పలువురు సన్మానించారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version