హోమ్ టాప్ న్యూస్ సరస్వతి దేవి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం

సరస్వతి దేవి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం

0

-ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం హరి హర క్షేత్రంలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకల సందర్భంగా సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించిన కట్కూరి వెంకటేష్ ఆలయంలో పంచామృతాభిషేకం, సహస్ర నామ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు నూతన విద్యాభ్యాసం కొరకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేద పండితులు ఫనిభట్ల అంబ ప్రసాద్ మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతి మాత పూజ నిర్వహించి చిన్నారులకు అక్షరాలు దిద్దించారు. ఆలయానికి విచ్చేసిన విద్యార్థులకు, భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version