హోమ్ టాప్ న్యూస్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజాబాట’ కార్యక్రమం

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజాబాట’ కార్యక్రమం

0

-విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఏఈ ప్రభాకర్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నేతృత్వంలో మంచిర్యాల డివిజన్ ఆపరేషన్ సర్కిల్ క్యాతనపల్లి సెక్షన్ ఆధ్వర్యంలో ‘ప్రజాబాట’ కార్యక్రమాన్ని మందమర్రి మండల అదిల్ పేట్ గ్రామంలో విద్యుత్ శాఖ క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజాబాట’ కార్యక్రమాన్ని ఏఈ ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి రైతులు, ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి విద్యుత్ పరమైన సమస్యలును పరిష్కరించారు.వంగిన కరెంటు స్తంభాలను నిలబెట్టడం,పాత తీగలు మార్చడం, లోపభూయిష్టమైన ట్రాన్స్ఫార్మర్లు వంటివి మరమ్మత్తులు నిర్వహించారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో 24/7 నాణ్యమైన విద్యుత్ ను సరఫరా అందించడమే కాకుండా రైతులకు అవగాహన కల్పించడం విద్యుత్ శాఖ భావిస్తుందని ఏఈ ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెండుగురి పున్నం, ఎస్ఎల్ఐ శ్రీనివాస్, ఎల్ఐ దామోదర్ రాజు, లైన్‌మెన్ శంకర్,ఉప సర్పంచ్ రాజన్న,వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version