హోమ్ టాప్ న్యూస్ గుడిపేట బెటాలియన్ లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

గుడిపేట బెటాలియన్ లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

0

-నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథి: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-గుడిపేట 13వ బెటాలియన్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.గుడిపేట బెటాలియన్ లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 25 మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు చేతుల మీదుగా నమోదు పత్రాలను గడియారం శ్రీహరి వారికి అందజేశారు. అనంతరం 13వ బెటాలియన్ కమాండెంట్ వెంకట్ రాములు లను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ను తెలియజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు సభ్యులు కలిసి రెండు రోజుల లో మీ యూనిట్ లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులను కలుసుకొని సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఏవో షేక్ గౌస్, ఎస్ఎ సంతొష్, జేఏ ప్రద్యున్ను శర్మ, బెటాలియన్ ఉద్యోగులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version