హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో మారం జగదీశ్వర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

టీఎన్జీవో మారం జగదీశ్వర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

0

-ఉద్యోగుల సమస్యలపై కేంద్ర సంఘంతో చర్చించిన: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత.-నూతన సంవత్సరాన్ని పునస్కరించుకొని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, కేంద్ర సంఘం కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ లను హైదరాబాదులో ఆదివారం మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల మొక్కను బహుకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి, మారం జగదీశ్వర్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ఉద్యోగుల రావాల్సిన 6 పెండింగ్ డిఏలు,కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం తొలగించి పాత పెన్షన్ విధానం ను అమలుపరచాలని కోరారు.317 జీవో బాధితులకు సత్వర న్యాయం చేయాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 17 శాతం హెచ్ఆర్ఏ ఇప్పించాలని కేంద్ర సంఘం అధ్యక్షులు తో చర్చించారు.కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రభుత్వంతో మాట్లాడి తొందర్లోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరి సురేష్ బాబు,మంచిర్యాల జిల్లా టీఎన్జీవో కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version