
మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని హరికృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కంబాల నర్సయ్య ఆధ్వర్యంలో ఇందారం గ్రామానికి చెందిన చిప్పకుర్తి సతీష్‌ను ఘనంగా సన్మానించారు. విద్యా రంగంలో ఎంబీఏ, బీపీఈడీ, బీకాం మూడు డిగ్రీల్లో ప్రతిభ కనబరిచినందుకు ఆయనను అభినందిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చార్వాక హాస్పిటల్ హాల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్వాక హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నీలకంఠం, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, గాయకుడు సిరికొండ బోస్ హాజరయ్యారు. అలాగే యువ నాయకులు నక్క తిరుపతి, మీసా కొమురయ్య, తిరుమల రమేష్, అసంపెల్లి శ్రీనివాస్, మాజీపెల్లి రాములు, ఫ్రాన్సిస్, తిరుపతి, శ్రీధర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. చిప్పకుర్తి సతీష్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

