-ఈనెల 16న కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి కార్మిక వర్గానికి పిలుపు

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేబర్ కోడ్ లను రద్దు చేసేంతవరకు కార్మిక వర్గం దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని ఈనెల 16న మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ నిరసన ధర్నా నిర్వహిస్తామని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్,ఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ లను విడుదల చేశారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ..కార్పొరేటర్లకు అనుకూలంగా కాంట్రాక్టీకరణకు దారులు తెరుస్తూ, కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన భద్రత లేకుండా ఉన్న ఈ నాలుగు లేబర్ కోడ్ లను కేంద్రాల్లోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణకు అడ్డంకిగా ఉన్న, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చడమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్జి మల్లేష్,నడిగోట శంకర్, రామస్వామి, ముత్యాల వెంకటేష్, అప్పారావు, నాగరాజు శంకర్, రాణి, నరసమ్మ, లక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు.