-జిల్లా ఉద్యోగుల సమస్యలపై చర్చించిన: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్ట అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ (ఐఏఎస్) మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నీటి పారుదల శాఖ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ సానుకూలంగా స్పందిస్తూ ఈ శాఖలోని ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. టీఎన్జీవో తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సత్య రాజ్ చంద్ర,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విష్ణు,రాము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్, డీసీ వెంకటరమణ, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శివప్రసాద్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి