మంచిర్యాల ప్రత్యక్షత :-జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి సోమవారం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ ఏర్పాటు కల్పించినందుకు అలాగే మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు నిలుపుదలకు కృషి చేసిన రాష్ట్ర మంత్రికి జిల్లా టీజీఈజేఏసీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ కో-చైర్మన్ పొన్న మల్లయ్య, సమాచార సెక్రటరీ జాడి రామ్ కుమార్, కార్యదర్శి తంగళ్లపల్లి తిరుపతి, టీన్జీవోస్ యూనియన్ బెల్లంపల్లి అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రాజు,సురేందర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి