-ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత :-గత సంవత్సరాల కాలంలో రెండు సార్లు డైరెక్టర్ (పా )తో, ఒకసారి సింగరేణి సిఎండి తో సమావేశాలు జరిగినప్పటికీ, ఒప్పుకున్న అంశాలపై సైతం ఉత్తర్వులు లు జారీ చేయకుండా, కాలయాపన చేయడంతో సింగరేణి భవన్ లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాన్ని యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా బహిష్కరించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) కేంద్ర కార్యదర్శి అక్బర్ ఆలీ లు తెలిపారు. శనివారం ఏరియాలోని ఆర్కేపీ సీహెచ్పీ లో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకుని అమలు చేయడం లేదని ఆరోపించారు.ముఖ్యంగా సింగరేణిలో కార్మికుల స్వంత ఇంటి పథకంపై యాజమాన్యం వేసిన కమిటీ ఇంతవరకు ఒక సమావేశం జరుగలేదని, మెడికల్ బోర్డు విషయంలో పది సంవత్సరాలనుండి కొనసాగిన ఆనాడు లేని ఏసీబీ ని బూచిగా చూపి, బోర్డు ఆపడం యాజమాన్యం చేసిన తప్పు అని, గతంలో లాగా మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణికి 2024-2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు ప్రకటించి, అందులో నుండి కార్మికులకు 35 శాతం వాటా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగిందని, కానీ యాజమాన్యం ప్రకటించకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు.అదేవిధంగా ఇన్కమ్ టాక్స్ విషయంలో కోల్ ఇండియా మాదిరిగా పెర్క్స్ పై రికవరీ చేసిన వాటిని రిఫండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని, కానీ సింగరేణిలో లాభాల్లో వాటా ఇస్తున్నాము కాబట్టి ఇవ్వలేమని అంటుంన్నారని,ఇది సరైన విధానం కాదని చెప్పడం జరిగిందని, కానీ యాజమాన్యం నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు.కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని జరుగవలసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా, ఇంకా కాలయాపన చేస్తే ఏఐటియుసి ఆద్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రామకృష్ణాపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఉపకార లింగయ్య సిఎస్పి ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి మాదాసి వేణుగోపాల్, కమిటీ సభ్యులు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ అబ్బాస్, శ్రీధర్ రావు, దూత భాస్కర్, శ్రీనివాస్, డొక్కు శ్రీనివాస్, మండల శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, ఆవుల మల్లయ్య లు పాల్గొన్నారు.