రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన యువ రచయిత్రి, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత సింధూ కోలా యంగ్ చేంజ్ మేకర్ ఆఫ్ ఇయర్ గా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ద్వారక లోని రాడిసన్ బ్లూ లో ఉమన్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఆఫ్ సబ్ స్టాన్స్ నెట్వర్క్ అండ్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో నిర్వాహకులు ఆమెను ఈ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ బొగ్గు శాఖ మంత్రి సంతోష్ బగ్రోడియా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కే పుష్పలీల లు హాజరై, సింధును ప్రశంసా పత్రం, పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, సింధు కథనాలు, యువతులకు సాధికారత కల్పించడంలో ఆమె చూపిన అంకితభావం ప్రశంసనీయమన్నారు .ఒకే రోజుల్లో 774 ఈ బుక్స్ ని ప్రచురించడం వల్ల ప్రపంచ రికార్డుకు ప్రముఖంగా సహకరించిన సింధు, దేశంలో స్వీయ గుర్తింపు, మహిళ సాధికారత కోసం ఆమె ప్రముఖ గొంతుకగా కొనసాగుతుందని తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ, సింధు సాహిత్య రచనలు, ఆమె రచించిన అన్ డిఫైనబుల్ గర్ల్ పుస్తకం ప్రతిభవంతమైనవని కొనియాడారు. ప్రతిష్టమైన వేదికపై సింధుకు గొప్ప అవార్డు లభించడం పట్ల పలువురు ప్రముఖులు, ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి