-పలు అంశాలపై మంత్రితో చర్చించిన: గడియారం శ్రీహరి
-ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల ప్రత్యక్షత:- చెన్నూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక,భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామిని మంచిర్యాల హైటెక్ సిటీ క్యాంపు కార్యాలయంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. అనంతరం గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. పలు అంశాలపై ఉద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించారు. ఆయన అనుకూలంగా స్పందించి ఉద్యోగాల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘ కార్యదర్శి పొన్న మల్లయ్య, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.