-పలు ఉద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించిన:గడియారం శ్రీహరి

మంచిర్యాల (ప్రత్యక్షత):- చెన్నూరు నియోజకవర్గ భీమారం మండలం భూభారతి అవగాహన సదస్సు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రితో గడియారం శ్రీహరి మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సమస్యలపై చర్చించారు. మంచిర్యాల కార్పొరేషన్ ప్రతికరణ సందర్భంగా ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ఏ ప్రకటించాలని ఆయన కోరారు.
పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లను, పెండింగ్ బకాయి బిల్లులను, పి ఆర్ సి కమిటీ నివేదిక 51 శాతం తో వేతనాలు సవరించాలి. ఈ హెచ్ ఎస్ పథకాన్ని అమలుపరచాలి, పాత పెన్షన్ పద్ధతిని కొనసాగించాలి, జీవో 317 సమీక్షించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలి, సిపిఎస్, యుపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ను అమలు పరచాలి చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర 57 డిమాండ్లను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జిల్లా టిఎన్జీవో నాయకులు కోరారు. అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగుల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పై కృషి చేస్తానని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కేజియారాణి,రామ్, కుమార్,నరేందర్,తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్ కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.