
నస్పూర్ ప్రత్యక్షత: మంచిర్యాల జిల్లా నస్పూర్ తహసిల్దార్ సంఘర్స్ సంతోష్ గురువారం బాధ్యతలు ను స్వీకరించిన సందర్భంగా జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శులు భూముల రామ్మోహన్, పొన్న మల్లయ్య శాలువాతో సన్మానించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హౌసింగ్ సొసైటీ ఉద్యోగుల సమస్యలపై ఆయనతో చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ నస్పూర్ మండల ప్రజలకు అందరికీ మెరుగైన సేవలు అందేలా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.