హోమ్టాప్ న్యూస్బెల్లంపల్లిలో సీఎండీతో టీఆర్‌వీకేఎస్ భేటీ

బెల్లంపల్లిలో సీఎండీతో టీఆర్‌వీకేఎస్ భేటీ

Published on

spot_img

-కార్మికుల సమస్యలపై వినతి–సానుకూలంగా స్పందించిన సీఎండీ

మంచిర్యాల ప్రత్యక్షత:-బెల్లంపల్లి డివిజన్ పర్యటనలో భాగంగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ ఇంధన శాఖ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి (ఐఏఎస్)ని టీఆర్‌వీకేఎస్ హెచ్–58 ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమానికి రీజినల్ సెక్రటరీ,స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముష్క నర్సయ్య నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి డివిజన్‌లో ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సీఎండీకి వివరించారు.ముఖ్యంగా డివిజన్‌లో తీవ్ర సిబ్బంది కొరత నెలకొన్నందున ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, దీని కారణంగా సేవల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖాళీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసి సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరారు.అదేవిధంగా పాత మంచిర్యాల నుంచి వచ్చే 33 కేవీ విద్యుత్ లైన్ పొడవు అధికంగా ఉండడం వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. ముఖ్యంగా మందమర్రి పాలచెట్టు ప్రాంతం వరకు ఉన్న 33 కేవీ లైన్ నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.టీఆర్‌వీకేఎస్ నాయకులు తెలిపిన సమస్యలను సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడు బి. దామోదర్ రాజు, మంచిర్యాల డివిజన్ కార్యదర్శి ఎస్. వినోద్, బెల్లంపల్లి డివిజన్ ప్రతినిధులు, అలాగే మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజన్న, బెల్లంపల్లి ఇన్‌చార్జ్ డీఈ మల్లేశం, ఏడీ టౌన్ బెల్లంపల్లి కాటం శ్రీనివాస్, రూరల్ ఏడీ రవికుమార్, ఏఈ టెక్నికల్ బెల్లంపల్లి డివిజన్ అధికారులు ,సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this