
ప్రత్యక్షత:- వేములవాడ పట్టణంలోని 21 వార్డ్ పాత కూరగాయల మార్కెట్ కు చెందిన పార్టీ వార్డు అధ్యక్షుడు గుండా రాజశేఖర్ గౌడ్ సతీమణి వరలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, మారం కుమార్, సీనియర్ నాయకులు నరాల దేవేందర్, మల్లేశం తదితరులు ఉన్నారు.
