-కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థిగా మంతెన సమ్మయ్య పేరు పరిశీలన.

చెన్నూరు ప్రత్యక్షత: నియోజకవర్గం భీమారం మండలం జడ్పీటీసీ (ఎస్సీ జనరల్) స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంతెన సమ్మయ్య పేరును పార్టీ పరిశీలిస్తోందని సమాచారం.ఈ ఎన్నికల్లో బలమైన ప్రజలలో,గుర్తింపు పొందిన అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తుందని సమాచారం.ఉద్యమ నేతగా ప్రస్థానం ప్రారంభించిన సమ్మయ్య,చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2004 నుండి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మండలం క్షేత్రస్థాయిలో చురుకైనా పాత్ర పోషిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు,ప్రలోభాలకు లొంగకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలబడ్డారు.నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ తన సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు.సొంత గ్రామం భీమారం మండలం కొత్తపల్లి,గత 8 సంవత్సరాలనుండి పాత్రికేయుడుగా పనిచేయడంతో, మండలంలోని 11 గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి, ప్రజలు,యువకులతో,మంచి పరిచయాలతో సామాన్యుల పక్షాన నిలిచి వారి మన్ననలు పొందుతూ ఉండడం విశేషం. దీనితో మండల వాసులతో, ఎప్పటికప్పుడు అందుబాటులో,కుటుంబ సభ్యుడిగా ఉంటు వ్యక్తిగతంగానూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.మృతుల కుటుంబాలకు తనవంతు సహాయం అందించడం, సాగునీటి కాలువలు, దారుల మరమ్మతులు చేయించడం, వీధిదీపాలు,అంతర్గత రోడ్ల మరమ్మతులు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ యువ నాయకుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సేవా దృక్పథం కలిగిన మంతెన సమ్మయ్య అటువంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే మండలానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలు,యువత అభిప్రాయపడుతున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి