హోమ్ టాప్ న్యూస్ ప్రజల సౌకర్యార్థం వందే భారత్ రైలు నిలుపుదల

ప్రజల సౌకర్యార్థం వందే భారత్ రైలు నిలుపుదల

0

-హర్షం వ్యక్తం చేసిన టీజీఈజేఏసి చైర్మన్ గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రమైన మంచిర్యాల స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వడంతో మంచిర్యాల, చుట్టుపక్కల ప్రజలకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని టిజిఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టిఎన్జీవో భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వందే భారత్ రైలు మంచిర్యాల స్టేషన్లో నిలుపుదలకు కృషిచేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులకు టీజీఈజేఏసి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా టిజిఈజేఏసీ ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి, జేఏసి కో చైర్మన్లు చక్రపాణి, కృష్ణ, వెంకటేశ్వర్లు, సుభాష్, సుమిత్, సంజీవ్, వేణుగోపాల్, సత్తయ్య, ప్రభాకర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు, దుర్గాప్రసాద్, డిప్యూటీ చైర్మన్లు భూముల రామ్మోహన్, సుధాకర్, టీఎన్జీవో యూనియన్ జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శులు సునీత, రవి కిరణ్, ప్రభు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, రోశయ్య, ప్రణవనంద లు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version