హోమ్ టాప్ న్యూస్ పదోన్నతి పొందిన సుధాలక్ష్మికి సన్మానం

పదోన్నతి పొందిన సుధాలక్ష్మికి సన్మానం

0

-టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రభుత్వ బిసి బాలికల కళాశాల వసతి గృహంలో విధులు నిర్వర్తిస్తున్న సుధాలక్ష్మి గ్రేడ్ వన్ పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి టీఎన్జీవో భవనంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. బీసీ,ఎస్సీ సంక్షేమ శాఖలో పదోన్నతుల విషయంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర సంఘానికి నివేదిక అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు మోసిన్ అహ్మద్,టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు గోపాల్, సంయుక్త కార్యదర్శి సునీత, కే శ్రీనివాస్, సరిత,రమేష్,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version