హోమ్ టాప్ న్యూస్ జిల్లా టీజీఈజేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా టీజీఈజేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక

0

-చైర్మన్ గడియారం శ్రీహరి, జనరల్ సెక్రెటరీ వనజ రెడ్డి ఎన్నిక

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో గురువారం తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.టీజీఈజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా టీజీఈజేఏసీ నూతన చైర్మన్ గా గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ వనజ రెడ్డి లను జిల్లాలోని సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు సమావేశమై వారి నేతృత్వంలో నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా గడియారం శ్రీహరి, వనజ రెడ్డి లు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిళ్ళు, వాగ్దానాల అమలులో జాప్యం ఆర్థిక సమస్యల నేపద్యంలో వివిధ తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్సనర్స్ సంఘాలు ఏకదాటిగా ముందుకు వచ్చి టీజీఈజేఏసీ ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగ సంఘాల జేఎసి పోరాడినట్లే మళ్ళి ఇప్పుడు ఉద్యుగుల హక్కుల సాధనకు. ఆత్మ గౌరవాన్ని కాపాడుటకు ఈ కమిటి రాబోయే రోజుల్లో కృషి చేస్తుందని అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తుందని అన్నారు. 317 జీవో బాధితుల సమస్యలను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మాపై నమ్మకంతో చైర్మన్ గా ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికీ న్యాయం చేస్తామని సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నుకోబడినఅడిషనల్ సెక్రటరీ జనరల్ శంకర్. కో చైర్మన్లు చక్రపాణి, క్రిష్ణ, వెంకటేశ్వర్లు, సుభాష్,సుమిత్,సంజీవ్, రమేష్, వేణుగోపాల్,సత్తయ్య, ప్రభాకర్, బాపు రావు, పొన్న మల్లయ్య, దుర్గా ప్రసాద్, మూర్తి, రాజేశ్వర్, డిప్యూటీ చైర్మన్లు భూముల రామ్మోహన్, సుధాకర్, వైస్ చైర్మన్లు గా మోహన్, రాజ వేణు, శబాపు,మనోజ్,జయ కృష్ణ తదితరులు సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version