-సరైన పత్రాలు లేని 31 వాహనాలకు జరిమానాలు
-మద్యం,గుడుంబా అమ్ముతున్న వ్యక్తులపై కేసులు నమోదు

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో సోమవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 31 వాహనాలను గుర్తించి యాజమాన్లకు జరిమానాలు విధించారు. బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు నిర్వహిస్తున్న ఇండ్లపై తనిఖీలు నిర్వహించి మద్యం గుడుంబా పట్టుకొని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ..కాలనీ ల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు నిర్వహించిన మద్యం,గుడుంబా, తయారీ అమ్మకాలు గంజాయి సేవించిన వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేయాలని, లేదా ఎస్ఐ, సీఐలకు సమాచారం అందించాలని సూచించారు.ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ..పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేస్తారని అన్నారు. పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసులకు సమాచారం అందజేయాలని అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం వల్ల కాలనీలో నేరాల నియంత్రణ అరికట్టే అందుకోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
