
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా పరిపాలన అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రావు దేశ్ పాండే ని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని కోరుతూ టీఎన్జీవో నాయకులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, కోశాధికారి సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి సునీత ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, సెక్రటరీ అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసుఫ్, మల్లేష్, ప్రజ్ఞ, గంగారం తదితరులు పాల్గొన్నారు.

