
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా పరిపాలనా వ్యవస్థలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా రెవెన్యూ అధికారి మోతి రామ్, జిల్లా ట్రెజరీ అధికారి రమేష్, జిల్లా పే అండ్ అకౌంట్స్ అధికారి ఎల్.రమ లను తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి నాయకత్వంలో సంఘ ప్రతినిధులు నూతన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. అనంతరం వారి నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా పరిపాలనలో రెవెన్యూ, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు కీలకమైన పాత్ర ఉందని పేర్కొన్నారు. ప్రజా పరిపాలనలో పారదర్శకత, సమర్థత, ఉద్యోగుల సంక్షేమం, ప్రజలకు వేగవంతమైన సేవల అందింపులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమ సేవలను కొనసాగించాలని కోరారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు టీఎన్జీవో నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పరిపాలనను మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి రాంకుమార్, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు అజయ్, మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.


