-ఉద్యోగులందరూ ఆమె మృతికి సంతాపం
-చిత్రపటానికి నివాళులు అర్పించిన ఆర్డిఓ శ్రీనివాసరావు

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలోని నెన్నెల మండల తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తూ జ్యోతి మంగళవారం గుండెపోటుతో మృతి చెందడం రెవెన్యూ శాఖకు తీరనిలోటని మంచిర్యాల ఆర్డీవో గూడూరు శ్రీనివాసరావు అన్నారు.జిల్లా కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) భవనంలో శుక్రవారం ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉద్యోగులందరూ ఆమె మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి కుటుంబ సభ్యులకి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ..ఈ మధ్యకాలంలో రెవెన్యూ ఉద్యోగులు చాలా ఒత్తిడి ఉందని పనిచేసేటప్పుడు ఒత్తిడికి గురి కావద్దని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు తహశీల్దార్లు,రెవెన్యూ ఉద్యోగులు, ట్రెసా నాయకులు మాట్లాడుతూ తహశీల్దార్ జ్యోతి ఒక ధైర్యవంతురాలు అయిన రెవెన్యూ అధికారి అని అందరితో కలుపుగోలుగా ఉండే మనిషి అని అలాంటి ఆమె ఒత్తిడికి గురికావడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో ఒత్తిడికి గురికావడం కూడా ఆమె మరణానికి ఒక కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షులు ఇత్యాల కిషన్, కార్యదర్శి కృష్ణ, ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు దేశ్ పాండే, టి.జి.ఓ.అధ్యక్షురాలు వనజ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి,టీజిఆర్ఎస్ అధ్యక్షులు పోచయ్య, జిల్లాలోని తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.