హోమ్టాప్ న్యూస్తహసిల్దార్ పదవీ విరమణ సందర్భంగా టీఎన్జీవో సత్కారం

తహసిల్దార్ పదవీ విరమణ సందర్భంగా టీఎన్జీవో సత్కారం

Published on

spot_img

బెల్లంపల్లి ప్రత్యక్షత:-ఇటీవల పదవీ విరమణ పొందిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా (తహసిల్దార్) విధులు నిర్వహించిన పుప్పాల హనుమంతరావు, ఆయన సతీమణి జ్యోతి దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో హనుమంతరావు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన క్రమశిక్షణ, నిబద్ధత యువ ఉద్యోగులకు మార్గదర్శకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రెవెన్యూ శాఖ ఉద్యోగులకు తన అనుభవంతో సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు కందుకూరి సురేష్ బాబు, మాజీ కార్యదర్శి భూముల రామ్మోహన్, టీజీవో జగిత్యాల అధ్యక్షుడు కందుకూరి రవిబాబు, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సమస్యల పరిష్కారానికి వినతి

-అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహ...

బొక్కలగుట్టలో సీసీ కెమెరాల నిఘా..గ్రామ భద్రతకు మరింత భరోసా

-నేరాల నియంత్రణకు 12 సీసీ కెమెరాల ఏర్పాటు -చొరవ చూపిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అభినందించిన డీసీపీ ఎగ్గడి భాస్కర్ రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల...

క్యాతనపల్లి కమిషనర్ గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో...

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్ భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో...

More like this