హోమ్ టాప్ న్యూస్ తహశీల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

తహశీల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు

0

మంచిర్యాల ప్రత్యక్షత:-దండేపల్లి తహశీల్దార్ కార్యాలయం లో
టీఎన్జీవో లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సభ్యత్వ నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, టీజీవో జిల్లా అధ్యక్షురాలు వనజ విచ్చేశారు. జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సభ్యత నమోదులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, అగ్రికల్చర్ ఇతర శాఖల నుండి 110 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం నమోదు చేసుకున్నారు.టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు సభ్యులు మధ్యాహ్నం సమయంలో మీ యూనిట్ లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులను కలుసుకొని జనవరి 10 లోపు సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని ఉద్యోగులకు పలు సమస్యల పైన టీఎన్జీవో జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా సభ్యులు, టీఎన్జీవో లక్షేట్టిపేట యూనిట్ కార్యదర్శి శ్రీనివాస్, భూమన్న సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version