హోమ్ టాప్ న్యూస్ “చైనా మాంజా” అమ్మితే కఠిన చర్యలు

“చైనా మాంజా” అమ్మితే కఠిన చర్యలు

0

-మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ హెచ్చరిక

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలోని వ్యాపార దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ వ్యాపార యజమానులకు ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్బంగా శశిధర్ మాట్లాడుతూ..బి-జోన్ సెంటర్, రాజీవ్ చౌక్ లో గల దుకాణ యజమానులతో మాట్లాడి “చైనా మాంజా దారంను” ప్రభుత్వం నిషేధించినదని, గతంలో గాలిపటాలు ఎగిరేసే సమయంలో చైనా మాంజా దారం వాడటం వలన చాలామంది ప్రజలు, పక్షులు, వాహనదారులు,గాయాలపాలైనరని కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారని అన్నారు.సంక్రాంతి పండగ సందర్బంగా రామకృష్ణాపూర్ పట్టణoలోనీ దుకాణ యజమానులు ఎట్టి పరిస్థితు లో చైనా మాంజా దారం అమ్మవద్దని హెచ్చరించారు.అదేవిధంగా పట్టణంలోనీ యువకులు, పిల్లలు పంతాగులు ఎగిరేసే సమయంలో ఎవరు కూడా “చైనా మాంజా దారం” వాడకూడదని, పండగను ప్రశాంతంగా, సుఖసంతోషాల మధ్యలో భద్రంగా జరుపుకువాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై భూమేష్, హెడ్ కానిస్టేబుల్ జంగు,దుకాణ యజమానులు, యువకులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version