హోమ్ టాప్ న్యూస్ మెడికల్ అండ్ హెల్త్ శాఖలో టీఎన్జీవో సభ్యత్వం

మెడికల్ అండ్ హెల్త్ శాఖలో టీఎన్జీవో సభ్యత్వం

0

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా మెడికల్ అండ్ హెల్త్ శాఖల జిల్లా కార్యాలయం టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సభ్యత్వ నమోదు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి పాల్గొన్నారు. అతిథులుగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,విచేయగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 52 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం నమోదు తీసుకున్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని మిగిలి ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు జనవరి 10 లోపు సభ్యత్వం నమోదు తెలుసుకోవాలని అన్నారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రణవానంద్, మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version