హోమ్ టాప్ న్యూస్ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు సన్మానం

టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు సన్మానం

0

-కలెక్టర్ ను భవన శంకుస్థాపన, బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లాకు జల సంరక్షణంలో జల్ సంచయ్ జన్ భగీదారి అవార్డుకు ఎంపికైన సందర్భంగా జిల్లాకు అరుదైన గౌరవం కోసం కృషి చేసిన జిల్లా కలెక్టర్ ను టీజీఈజేఏసీ ఛైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.జల సంరక్షణలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జాతీయ జల్ సంచయ్, జన్ భగీదారి అవార్డు కు దక్షిణ భారత దేశం నుండి మంచిర్యాల జిల్లా ఎంపిక అయినందుకు హర్షం వ్యక్తం చేశారు, దీనిపై కృషి చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి,సభ్యులు అభినందించారు. జిల్లా కేంద్రంలో టీజీఈజేఏసీ, టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర చైర్మన్, కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే టీఎన్జీవో యూనియన్ భవన శంకుస్థాపన, సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ను సతీసమేతంగా హాజరు కావాలని టీజీఈజేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీన్జీవోస్ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపు, కేంద్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జాడి రామ్ కుమార్, తంగళ్లపల్లి తిరుపతి, రాజేందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నాగుల గోపాల్, అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి సునీత మరియు కార్యవర్గ సభ్యులు విజయ, అశోక్, గంగారం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version