హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో భవనం ప్రారంభించిన మారం జగదీశ్వర్

టీఎన్జీవో భవనం ప్రారంభించిన మారం జగదీశ్వర్

0

-ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడతాం

-బాధితులకు అనుకూలంగా 190జీవో ను సాధించాం

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో టీఎన్జీవో యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర సంఘం టిఎన్జీవో మారం జగదీశ్వర్, ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్ సంద అశోక్, మంచిర్యాల అధ్యక్షులు గడియారం శ్రీహరి, మాజీ అధ్యక్షులు కందుకూరి సురేష్ బాబు లు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన టీఎన్జీవో భవన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మారం జగదీశ్వర్, సంద అశోక్ ను యూనియన్ కమిటీ సభ్యులందరూ శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

నూతన భవన ప్రాంగాణంలో వారు మొక్కలను నాటారు.ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ..
ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వంలో సమన్యాయంగా టీఎన్జీవో, టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు కొరకు పోరాడుతున్నామని అన్నారు.317 జీవో బాధితులకు ఉపయోగపడే జీవో190 ను సాధించిన ఘనత టీజీఈజేఏసీ సాధించిందని అన్నారు. మరికొన్ని సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు.ఆ సమస్యలు అన్ని అతి త్వరలో సబ్ కమిటీతో చర్చలు జరిపి సమస్యల ను పరిష్కరిస్తామని తెలిపారు.

గడియారం శ్రీహరి మాట్లాడుతూ..టీఎన్జీవో కేంద్ర సంఘం టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ తరపున ఎలాంటి పిలుపునిచ్చిన జిల్లా తరఫున ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంచిర్యాల నూతన కార్పొరేషన్ అయిన సందర్భంగా హెచ్ఆర్ఏ పెరగవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మారం జగదీశ్వర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ మాజీ కార్యదర్శి పుప్పాల హనుమంతరావు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి సందీప్,జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్,రామ్ కుమార్, తిరుపతి సంయుక్త కార్యదర్శి సునీత,రవి కిరణ్,ప్రభు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్ బెల్లంపల్లి అధ్యక్షులు వెంకటేష్ లక్షెట్టిపేట్ యూనిట్ అధ్యక్షులు జి శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్ రోశయ్య, విజయ ప్రణవనంద తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version